June 13, 2010

Krsna Tatvamu

కృష్ణ తత్త్వం - జీవ తత్త్వం. శ్రీ కృష్ణుని లీలలను , వాటి అంతరార్ధమును గుర్తించిన వాడు ధన్యుడు. ఆ అంతరార్ధములోని అర్థమును అమలు పరచినవాడు మహాత్ముడు. మన శరీరము రధమైతే్ ఇంద్రియాలు గుర్రాలు , బుద్ధి దాని సారథ. ఆ బుద్ధి కి అర్ఘ్యం పోసేది మనస్సు. కామ క్రోధ మద మోహ మాత్సర్యములన్న అరిశాద్వార్గాముల చే కప్పబడుతున్న మన మనస్సుని బుద్ధి అనే సారధి సత్యము వైపుకి తీసుకు వెళ్తుంద. అలాంటి పార్థసారధి గా వాసేకి ఎక్కిన  మహా పురుషోత్తముడు - శ్రీ కృష్ణ భగవానుడు.
అంతటి మహాత్ముని చారిత్రమును అపార్ధము చేసుకుని ఆయనను కేవలం ఆడువారి వెంట తిరిగే దుష్టుడి లాగా చిత్రీకరిస్తున్నారు.అయిన అలాంటి  దానికి  చిహ్నం  అవ్వటం  మనమందరం  సిగ్గు  పడాల్సిన  విషయం.
అసలు నిజంగానే కృష్ణుడికి  అంత  మంది  భార్యలు , గోపికలు  ఉన్నారా ? ఆ  రాసలీలకు  అంతరార్దమేమి?

నిజానికి  భర్త  అన్న  మాటకు  అర్ధం  కేవలం  "భరించే  వాడు". మనం అనగా మన ఆత్మ. ఆ  ఆత్మ పరమాత్మకు  చెందినది . అది  అయిన సొత్తు . కాని మనస్సు ఎల్లప్పుడూ మనల్ని  - అనగా  మన  ఆత్మని  - ఆ  పరమాత్మ  నించి  దూరము  చెయ్యుటకు  ప్రయత్నిస్తుంది . ఇంద్రియ  లాలస  పుట్టించి  , అసత్యాన్ని సత్యముగా  సంతోషకరముగా చూపిస్తుంది . ఆ  మాయ  లో  మునిగి  మనం  జీవిత  చక్రం  లో  నలిగి  పరమాత్మను  పొందలేకపోతాము . కాని  మనస్సు  చుపించేవాన్ని అసత్యములు , అవి  కేవలం  ఇహం  లో  సుఖాన్ని  ఇస్తాయి  కాని  పరము  లో  ఇవ్వవు  అన్న  సత్యాన్ని  గ్రహించినవాడు  పరమాత్మకు  దగ్గర అవుతాడు. అనగా మన  ఆత్మ  కు  యజమాని , భర్త - ఆ  పరమాత్మ . పరమాత్మ  కేవలం ఒకే భావనకి లొంగిపోతాడు  - శరణాగతి . తనను నమ్ముకున్న  వాడిని  భరిస్తాడు  పరమాత్మ . వారికి  భర్త  అవుతాడు . ఈ  సత్యాన్ని  తెలుసుకున్న  వారు   ఆ  గోపికలు  , అయిన  భార్యలు . ఇది  ఆ  లీల అంతరార్థము.

సర్వం శ్రీ క్రిష్ణార్పనమస్తూ !